ప్రమాద రహితంగా తీర్చిదిద్దుదాం.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాద రహితంగా తీర్చిదిద్దుదాం..

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

నేలకొండపల్లి: జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దే ప్రయత్నానికి అందరూ సహకరించాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ సూచించారు. మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు ‘అరైవ్‌.. అలైవ్‌’ పేరిట నిర్వహించిన అవగాహన సదస్సులో సీపీ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో పోలీసు శాఖ ఆధ్వర్యాన అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, ఈ మేరకు రహదారిపై వెళ్లే సమయాన తమ కోసం కుటుంబం ఎదురుచూస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. తొలుత మండల కేంద్రంలో పలుచోట్ల వేగ నియంత్రణ సూచిక బోర్డులను సీపీ స్వయంగా ఏర్పాటు చేశారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్సై సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పరిశీలన

వైరా: వైరా మండలంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను సీపీ సునీల్‌దత్‌, నేషనల్‌ హైవే అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ దివ్యతో కలిసి మంగళవారం పరిశీలించారు. సోమవరం గ్రామం నుంచి వైరా రింగ్‌ రోడ్డు వరకు రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌బీ అధికారులకు సూచించారు. అలాగే, వైరా రింగ్‌ రోడ్డు సెంటర్‌లో అక్రమణలు తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. వైరా ఏసీపీ సారంగపాణి, సీఐ వెంకటప్రసాద్‌, ఎస్‌ఐలు రామారావు, పవన్‌ పాల్గొన్నారు.

పోలీస్‌ క మిషనర్‌ సునీల్‌దత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement