ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని.. అందులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోందని మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మొదలయ్యాక ఈ నెల 30వ తేదీ వరకు రూ.10 కోట్ల మేర టికెట్ చార్జీల రూపంలో మహిళా ప్రయాణికులకు ఆదా అయ్యాయి. ఈ నేపథ్యాన మంగళవారం ఖమ్మం కొత్త బస్టాండ్‌లో ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎ.సరిరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. ఉచిత ప్రయాణంతో మహిళలకు ఆదా అవుతున్న నగదు కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం ఆర్‌ఎం సరిరాం మాట్లాడగా.. మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ఐదుగురిని సన్మానించారు. ఖమ్మం డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్, అకౌంట్స్ ఆఫీసర్ జ్యోత్స్న, ఉద్యోగులు పాల్గొన్నారు.
‘మహాలక్ష్మి’సమావేశంలో మేయర్, ఆర్టీసీ ఆర్‌ఎం


