ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా జైపాల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా జైపాల్‌

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

ఖమ్మంసహకారనగర్‌: టీఎన్జీవోస్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకోగా ఉమ్మడి జిల్లా నుంచి జడ్‌ఎస్‌.జైపాల్‌కు స్థానం దక్కింది. ఆయన మంగళ వారం ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా బాధ్యతలు స్వీ కరించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు జైపాల్‌ను టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఆ తర్వాత టీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును జైపాల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రైవేట్‌ పాఠశాల బస్సు దగ్ధం

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం గోపాలపురంలో పార్క్‌ చేసిన ఒక ప్రైవేట్‌ పాఠశాల బస్సు దగ్ధమైంది. గత నెల 15వ తేదీన రాత్రి పాఠశాల ప్రాంగణంలో పార్క్‌ చేసిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోయింది. ఘటనపై పాఠశాల యజమాని ఆలస్యంగా ఇచ్చిన ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement