సీతారాములకు మహదాశీర్వచనం | - | Sakshi
Sakshi News home page

సీతారాములకు మహదాశీర్వచనం

Mar 30 2026 8:43 AM | Updated on Mar 30 2026 8:43 AM

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సీతారాములకు పండితులు మహదాశీర్వచనం అందజేశారు. కల్యాణంలో పాల్గొని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ క్రతువు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు వివరించారు. కల్యాణం జరిగిన మూడోరోజున స్వామి వారికి మహదాశీర్వచనం అందజేయడం సంప్రదాయమని వెల్లడించారు. ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి పూలు, పండ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారికి తెప్పోత్సవం, దొంగల దోపు ఉత్సవాలను నిర్వహించనున్నారు.

వైభవంగా నదీ హారతి

భద్రాచలం టౌన్‌: భద్రాచలం గోదావరి తీరంలో ఆదివారం సాయంత్రం నదీ హారతి కార్యక్రమం కనువిందుగా సాగింది. పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి స్నానఘట్టాల వద్ద పూజలు, దీపోత్సవం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement