తపాలా లావాదేవీలకు నాలుగు రోజుల విరామం | - | Sakshi
Sakshi News home page

తపాలా లావాదేవీలకు నాలుగు రోజుల విరామం

Mar 30 2026 8:43 AM | Updated on Mar 30 2026 8:43 AM

ఖమ్మంగాంధీచౌక్‌: ఆర్థిక సంవత్సరం ముగింపు, సెలవుల నేపథ్యాన పోస్టల్‌ సేవింగ్‌ బ్యాంక్‌ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది. ఈనెల 31న మంగళవారం మహావీర్‌ జయంతి సందర్భంగా సెలవు కాగా, ఏప్రిల్‌ 1, 2వ తేదీల్లో నూతన ఆర్థిక సంవత్సరం లావాదేవీల కోసం విరామం ఇవ్వనున్నారు. అలాగే, 3వ తేదీ శుక్రవారం గుడ్‌ ఫ్రైడే సెలవుతో నాలుగు రోజుల పాటు పీఓఎస్‌బీ సేవలు ఉండవని అధికారులు వెల్లడించారు.

పోరాటాలతోనే

హక్కుల సాధన

ఖమ్మంగాంధీచౌక్‌: సమస్యల పరిష్కారం, హ క్కుల సాధన పోరాటాలతోనే సాధ్యమని ఎన్‌ఎఫ్‌పీఈ(నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌) రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌ అన్నా రు. ఎన్‌ఎఫ్‌పీఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ద్వైవా ర్షిక మహాసభ ఆదివారం ఖమ్మంలోని తపాలా ప్రధాన కార్యాలయంలో జరిగింది. యూనియ న్‌ ప్రతినిధులు ఏలూరి శ్రీనివాసరావు, వై.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా పనిభారం మోపుతోందని విమర్శించారు. ఈనేపథ్యాన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు తప్పవని పేర్కొన్నారు. యూనియన్‌ నాయకులు మహేందర్‌, మధుసూదన్‌రావు, లెనిన్‌ శ్రీనివాస్‌, ఎస్‌వీ.రావు, రామశాస్త్రి, నాగేశ్వరరావు, జయరాజు, ఖాజామోహినుద్దీన్‌, మౌ లాలి, రాజ్యలక్ష్మి, సుబేదాబేగం, ఖమ్మం డివిజ న్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టుమెన్ల సంఘం అధ్యక్షుడిగా వై.సత్యనారా యణ, కార్యదర్శిగా పెరుగు నాగేశ్వరరావు, క్లాస్‌–3 యూనియన్‌ అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు, కార్యదర్శిగా బందెల నాగరాజు, కోశాధికారిగా రవీందర్‌ను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement