నాలుగో తరగతి ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నాలుగో తరగతి ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక

Mar 30 2026 8:43 AM | Updated on Mar 30 2026 8:43 AM

ఖమ్మం సహకారనగర్‌: తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా బిక్కు, సహాయ కార్యదర్శిగా ఓదేలు, ఉపాధ్యక్షులుగా మురళీమోహన్‌, జి.కృష్ణయ్య, బి.వీరమణ, సత్యప్రసాద్‌, కార్యదర్శిగా వెంకరటమణ, సహాయ కార్యదర్శులుగా బుర్రి వెంకన్న, సీహెచ్‌.నారాయణరావు, ఎం.అరుణ, కోశాధికారిగా అజ్మత్‌ బేగ్‌ ఎన్నికయ్యారు. అలాగే, కార్యాలయ అబ్దుల్‌ గపూర్‌, కె.రవికుమార్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా ఎస్‌.కే.హమీద్‌, సూరారెడ్డి, ప్రచార కార్యదర్శులుగా జె.నర్సింహరావు, డి.వీరేందర్‌, క్రీడా కార్యదర్శిగా బి.వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులుగా చంద్రశేఖర్‌, ఎస్‌కె.రహీం, ఝాన్సీ, అఫ్ణాన్‌ బీ, టి.శ్యామల ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కె.శ్రీరామ్‌ వెల్లడించారు. నూతన కార్యవర్గం మూడేళ్లు కొనసాగుతుందని తెలిపారు.

టీఎన్జీవోస్‌ రాష్ట్ర కమిటీకి జిల్లా నేతల సన్మానం

ఖమ్మం సహకారనగర్‌: టీఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికై న మారం జగదీశ్వర్‌, ఎస్‌ఏ.హుస్సేనీ ముజీబ్‌లను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాస్‌, కొణిదన శ్రీనివాస్‌ తదితరులు హైదరాబాద్‌లో ఆదివారం సన్మానించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల కార్యవర్గాలు పాల్గొన్న ఈ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నియ్యారని తెలిపారు. అంతేకాక జిల్లాకు చెందిన జైపాల్‌కు రాష్ట్ర కమిటీలో చోటు దక్కిందన్నారు. నాయకులు కొమరగిరి దుర్గాప్రసాద్‌, గంగవరపు బాలకృష్ణ, జైపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement