వైరా: వైరా మున్సిపాలిటీ పరిధి దిద్దుపూడి రెవెన్యూలోని రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని డంపింగ్ యార్డ్‌గా వాడుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. యార్డ్ స్థలాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, అధికారులతో కలిసి శనివారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. డంపింగ్ యార్డ్‌కు వెళ్లే రహదారిని అభివృద్ధి చేయడంతో పాటు షెడ్డు నిర్మాణం చేపట్టాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ యు.గురులింగం, తహసీల్దార్ సురేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.
●కారేపల్లి: కారేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్‌లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన ఆమె, క్రీడా మైదానంలో ఏర్పాట్లు, బాలుర వసతి గృహ నిర్మాణంపై ఎంపీడీఓ శ్రీనివాసరావుకు సూచనలు చేశారు. ఎంపీఓ రాజేంద్రప్రసాద్, గ్రామ కార్యదర్శి నెహ్రూ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీజ


