సస్పెండ్‌ చేస్తావా.. కోర్టుకు వెళ్తా ! | - | Sakshi
Sakshi News home page

సస్పెండ్‌ చేస్తావా.. కోర్టుకు వెళ్తా !

Mar 29 2026 6:59 AM | Updated on Mar 29 2026 6:59 AM

నేలకొండపల్లి: బాధ్యత కలిగిన ఉద్యోగి మద్యం మత్తులో విధులకు హాజరు కావడమే కాక జిల్లా అధికారితో వాగ్వాదానికి దిగిన ఘటన ఇది. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న పంతులు శనివారం మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఏం.ఏ.అలీం సాధారణ తనిఖీల్లో భాగంగా కార్యాలయానికి వెళ్లగా ఈ విషయాన్ని గుర్తించారు. మద్యం తాగి రావడం ఏమిటని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ వాగ్వాదానికి దిగాడు. అంతేకాక ‘ఏం చేస్తారు? సస్పెండ్‌ చేస్తారా, చేసుకోండి... కోర్టుకు వెళ్తా’ అంటూ గొడవ పడ్డాడు. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు మార్కెట్‌ చైర్మన్‌కు ఫోన్‌లో వివరించిన డీఎంఓ.. 108 వాహనం పిలిపించి వైద్యపరీక్షల కోసం ఆయనను ఖమ్మం ఆస్పత్రికి పంపించారు. ఇటీవల పంతులు కార్యాలయ సిబ్బందిని కూడా దూషించినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఈ విషయమై డీఎంఓ అలీంను వివరణ కోరగా.... మద్యం మత్తులో విధులకు హాజరైన కార్యదర్శిపై వైద్యుల నుంచి నివేదిక వచ్చాక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.

మద్యం మత్తులో డీఎంఓతో మార్కెట్‌ కార్యదర్శి వాగ్వాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement