జిల్లా జడ్జిని కలిసిన నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

జిల్లా జడ్జిని కలిసిన నూతన కార్యవర్గం

Mar 29 2026 6:59 AM | Updated on Mar 29 2026 6:59 AM

ఖమ్మం లీగల్‌: ఖమ్మం బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ బాధ్యులు శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ను కలిశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యడ్లపల్లి రమేష్‌ ఆధ్వర్యాన వారు కలవగా, న్యాయమూర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో రవి, జానీమియా, శిరీష, రాధమ్మ, కళ్యాణి,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రికార్డులు కొట్టుకుపోయాయి..

ఖమ్మంరూరల్‌: మండలవ్యాప్తంగా 2024–25 సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి సామాజిక తనిఖీ సమావేశం శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను క్షేత్రస్థాయి సహాయకులు వివరించగా, అధికారులు నివేదికలను తనిఖీ చేశారు. అయితే, పనులకు సంబంధించి రికార్డులను పరిశీలించేందుకు అధికారులు సిద్ధం కాగా, 2024లో మున్నేటికి వచ్చిన వరదతో జలగంనగర్‌లోని ఎంపీడీఓ కార్యాలయ రికార్డులు పాడైపోయాయని బదులిచ్చారు. 2024 సెప్టెంబర్‌ నుంచి 2025 మార్చి వరకు రికార్డులే ఉన్నాయని చెప్పగా వాటిని పరిశీలించారు. ఆపై కొందరికి చేసిన పని కంటే రూ.6,509 ఎక్కువ చెల్లించినట్లు తేలడంతో రికవరీకి నిర్ణయించారు. అలాగే, విధులు సరిగ్గా నిర్వర్తించని సిబ్బందికి రూ.52 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అడిషనల్‌ డీఆర్‌డీఓ శ్రీదేవి, ఉద్యోగులు పద్మావతి, సక్రియా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

తూతూ మంత్రంగా ఓపెన్‌ ఫోరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement