యుద్ధంతో సామాన్యులపై భారం | - | Sakshi
Sakshi News home page

యుద్ధంతో సామాన్యులపై భారం

Mar 29 2026 6:59 AM | Updated on Mar 29 2026 6:59 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: అమెరికా, ఇజ్రాయిల్‌.. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంతో కార్మికులు, కర్షకులు, సామాన్యుల శ్రమశక్తి కాలిపోతోందని ఆర్థిక, సామాజిక విశ్లేషకులు డి.పాపారావు పేర్కొన్నారు. దేశీయ ఇంధన అవసరాలు 80 శాతానికి పైగా దిగుమతిపై ఆధారపడడంతో యుద్ధం కారణంగా ప్రభావితమవుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఉందని తెలిపారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం(బీవీకే) ఆధ్వర్యాన ఖమ్మంలో శనివారం ‘సామ్రాజ్యవాద యుద్ధం – ప్రజలపై ప్రభావం’ అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో పాపారావు మాట్లాడారు. యుద్ధం తో భవిష్యత్‌లో ఎరువుల కొరత తీవ్రమవుతుందని చెప్పారు. సహజ వాయువును పైప్‌లైన్‌ ద్వారా తీసుకువచ్చే ప్రాజెక్టు నుంచి అమెరికా ఆంక్షల కారణంగా భారత్‌ వైదొలగపోతే చౌక ధరకు సహజవాయువు అందేదని చెప్పారు. కాగా, ప్రపంచ ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపించేది కమ్యూనిస్టులు మాత్రమేనని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడగా బీవీకే జనరల్‌ మేనేజర్‌ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బండారు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక, సామాజిక విశ్లేషకులు పాపారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement