వెలుగుమట్లలో యుద్ధప్రాతిపదికన పనులు | - | Sakshi
Sakshi News home page

వెలుగుమట్లలో యుద్ధప్రాతిపదికన పనులు

Mar 29 2026 6:58 AM | Updated on Mar 29 2026 6:58 AM

ఖమ్మం అర్బన్‌: ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో లబ్ధిదారులకు మౌలిక వసతులు కల్పిస్తూ మోడల్‌ కాలనీని అభివృద్ధి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వెలుగుమట్లలో పనులను కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కాలనీలో విద్యుత్‌ స్తంభాలు, లైట్ల ఏర్పాటు పూర్తికాగా, ఇంటింటికీ తాగునీటి పైప్‌లైన్‌ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అంతర్గత రోడ్లు కూడా నిర్మించి ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్‌ చైర్మన్‌ యరగర్ల హన్మంతరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకుబ్‌, హౌసింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ రంజిత్‌, ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్లు డి.జయచందర్‌, సైదులు, విద్యుత్‌శాఖ డీఈ రామారావు, నాయకులు మిక్కిలినేని నరేంద్ర, రావూరి సైదబాబు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement