శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, పునర్జీవం పనులతోపాటు వచ్చే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రూ.351 కోట్లతో చేపట్టబోయే పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఆలయంలో ఈశాన్య మూలలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి గ్రూప్ ఫొటోకు ఫోజు ఇచ్చే సమయాన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కనిపించకుండా వెనకబడిపోయారు. దీంతో సీఎం కల్పించుకుని ‘ తెల్లం ముందుకురా అంటూ’ పిలిచారు. కాగా, రూ.351 కోట్లలో.. రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి, రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ.96 కోట్లతో ఆలయ పరి సరాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.


