● కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలం రోడ్(కొత్తగూడెం) రైల్వేస్టేషన్ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ నెలకొల్పాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం స్టేషన్ ఏర్పడి వందేళ్లు సమీపిస్తున్నందున చారిత్రక నేపథ్యాన్ని కొనసాగిస్తూ డివిజన్ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.


