‘పెదవాగు’ను సందర్శించిన పీఓఈ బృందం | - | Sakshi
Sakshi News home page

‘పెదవాగు’ను సందర్శించిన పీఓఈ బృందం

Mar 27 2026 9:19 AM | Updated on Mar 27 2026 9:19 AM

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టును పీఓఈ(ప్యానెల్‌ ఆఫ్‌ ఎక్స్‌ పర్ట్స్‌) బృందం గురువారం సందర్శించింది. భారీవర్షాలు, వరదలతో రెండేళ్లక్రితం పెదవాగు ప్రాజెక్టుకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు సేఫ్టీ, పున:నిర్మాణానికి జలవనరుల శాఖ నిపుణులతో నివేదిక ఇవ్వాల్సిందిగా సీఫార్సు చేశారు. స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ ఐదుగురితో కూడిన పీఓఈ బృందాన్ని నియమించగా, వారిలో డ్యామ్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌ అశోక్‌కుమార్‌ గంజు, జీయాలజీ ఎక్స్‌పర్ట్‌ ఎం.రాజు, రిటైర్డ్‌ ఎస్‌ఈ ఎన్‌.సంజీవ్‌, హైడ్రాలజీ ఎక్స్‌పర్ట్‌ భవానిరాంశర్మ, సీవిల్‌ ఎక్స్‌పర్ట్‌ బి.లక్ష్మణ్‌రావు ప్రాజెక్టును పరిశీలించారు. పునర్నిర్మాణం, డిజైన్‌, గేట్ల పెంపుతోపాటు నూతన డిజైన్‌తో నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఏపీలోని ఏలూరు జిల్లా నీటిపారుదలశాఖ అధికారులతో పాటు, సీఈ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

సింగరేణి రక్షణ, కార్మికుల

హక్కుల సాధనే లక్ష్యం

రుద్రంపూర్‌: సింగరేణి సంస్థను కాపాడుకోవడంతో పాటు కార్మికుల, ఉద్యోగుల భద్రత, హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తామని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (జీఎల్‌బీకేఎస్‌) గౌరవ అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలోని కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన జీఎల్‌బీకేఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి పరీవాహకంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నా నూతన గనుల ఏర్పాటులో పాలకుల నిర్లక్ష్యం సింగరేణికి నష్టం కలిగిస్తోందని తెలిపారు. ఇదే సమయాన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కార్మిక సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేలా ఏఐటీయూసీ చొరవ చూపాలని సూచించారు. సమావేశంలో జనరల్‌ సెక్రటరి జె.సీతారామయ్య, నాయకులు ఎ.వెంకన్న, ఎండీ రాసుద్దీన్‌, బ్రహ్మానందం, రామకృష్ణ, కాపు కృష్ణ, తోట రాయమల్లు, సంతు, సంజీవరావు, నాజర్‌పాషా పాల్గొన్నారు.

పశువులకు

టీకాలు తప్పనిసరి

తిరుమలాయపాలెం: ప్రభుత్వం ఉచితంగా సమకూరుస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు తప్పక వేయించాలని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి పురంధర్‌ సూచించారు.మండలంలోనిమేకలతండాలో గురువారం ఏర్పాటుచేసిన నిర్వహించిన టీకాల శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. గాలికుంటు వ్యాధితో పశువులకు నష్టం జరగకుండా ముందస్తుగా టీకాలు వేస్తున్నామని తెలిపారు. సుబ్లేడు పశువైద్యాధికారి ఎస్‌.కే. జానీ, ఉద్యోగులు ఎండీ.అక్బర్‌పాషా,రంగారావు, వీరబాబు, నారాయణ, భాస్కర్‌ పాల్గొన్నారు.

అటవీ ఉత్పత్తులతో ఆర్థికాభివృబ్ధి

ఖమ్మంవ్యవసాయం: అటవీ ఉత్పత్తుల ఆధారంగా వన సంరక్షణ సమితి సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ సూచించారు. తల్లాడ రేంజి పరిధి గూడూరుకు చెందిన వన సంరక్షణ సమితి సభ్యులతో గురువారం ఆయన ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగావన ఆధారిత జీవనోపాధి కార్యకలా పాలు, ఆదాయం, అభివృద్ధిపై చర్చించి సూ చనలు చేశారు. అలాగే, వెదురు ఉత్పత్తుల తయారీ, విక్రయాలు, ఎకో టూరిజం కార్యకలాపాలపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement