హోరాహోరీగా కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా కబడ్డీ పోటీలు

Mar 27 2026 9:19 AM | Updated on Mar 27 2026 9:19 AM

నేలకొండపల్లి: నేలకొండపల్లి యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యాన మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీ లు హోరా హోరీగా సాగుతున్నాయి. ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలస్థాయి పోటీల్లో భాగంగా శుక్రవారం నాలుగు మ్యాచ్‌లు జరిగగా.. పోటీలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు ప్రారంభించి కాసేపు క్రీడాకారులతో ఆడి ఉత్సాహపరిచారు. స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి వీక్షించారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌, నాయకులు, నిర్వాహకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, జెర్రిపోతుల అంజని, జెర్రిపోతుల సత్యనారాయణ, కడియాల నరేశ్‌, కొడిరెక్క వినోద్‌, మన్నె నరేశ్‌, కాసాని సందీప్‌, సొడెపొంగు ప్రశాంత్‌, రాయపూడి రోహిత్‌నాథ్‌, తోట వాసు, చింతమళ్ల వెంకటేశ్‌, కె.రమేశ్‌, మహేశ్‌, కొడిరెక్క శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

భద్రగ్రిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

నేలకొండపల్లి: గత పాలకులు భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయ అభివృద్ధిని విస్మరిస్తే, తమ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.560 కోట్లు కేటాయించిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని కోరట్లగూడెంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రుల చొరవతో భద్రగిరి ఆలయ అభివృద్ధికి రూ.560 కోట్లు కేటాయించడంతో పాటు శుక్రవారం శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. అంతేకాక అర్హులకు తెల్ల రేషన్‌కార్డులు మంజూరు చేయడంతో పాటు రూ.5 లక్షల బీమా చేయించనున్నట్లు చెప్పారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతీ ఒక్కరికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని, అందులో భాగంగా ఇటీవల పదవులు కేటాయించామని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్‌ చైర్మన్‌ వి.సీతారాములు, నాయకులు దుర్గాప్రసాద్‌, కొడాలి గోవిందరావు, వెంకన్న, భద్రయ్య, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

‘విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేక నష్టం’

కొణిజర్ల: రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోగా, సీఎం వద్దే ఉండడంతో పాటు అన్ని శాఖలను ఒకే కార్యదర్శి చూసుకోవాల్సి రావడంపై విద్యాశాఖపై పర్యవేక్షణ కొరవడిందని ఎస్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జె.సదానందగౌడ్‌ అన్నారు. కొణిజర్లలో గురువారం ఆయన సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. ఉపాధ్యాయులకు జీపీఎస్‌, జీఎల్‌ఐ, సరెండర్‌లీవ్‌ బకాయిలు రాకపోవడంతో రాష్ట్రంలో 18 వేలకు పైచిలుకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక రెగ్యులర్‌ డీఈఓలు, డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు ఉద్యోగులు లేక పాఠశాలలపై పర్యవేక్షణ తగ్గిందని వెల్ల డించారు. కాగా, పాఠశాలల రేషనలైజేషన్‌కు తాము వ్యతిరేకం కాకున్నా పాఠశాలలకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించి బలోపేతం చేయాలని సూచించారు. యూనియన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎన్‌ పర్వతరెడ్డి, నాయకులు వేముల మాధవరావు, షేక్‌ కరామత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement