ఖమ్మంసహకారనగర్: ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్(యూటీఎఫ్) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి ఆదర్శనీ యులని, ఆయన నేటిఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తారని రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని అన్నా రు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన వెంకటస్వామి వర్ధంతి సభలో ఆమె మా ట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడి అనేక హక్కులు సాధించారని తెలి పారు. అనంతరం విశ్లేషకులు ఐ.వీ.రమణారావు మాట్లాడుతూ ప్రస్తుత యుద్ధంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దేశాల మధ్య ఇబ్బంది ఏర్పడినప్పుడు అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలకు కట్టుబడి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు వెంకన్న, ష మీ, రాంబాబు, రాందా స్, సురేష్, ఉద్దండ్, పద్మ, నాగేశ్వరరావు, సుధాకర్, ప్రశాంతి పాల్గొన్నారు.


