పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి

Mar 25 2026 7:03 AM | Updated on Mar 25 2026 7:03 AM

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి మూడోసారీ సంత వేలం వాయిదా ట్రెంచ్‌ పనులను అడ్డుకున్న గిరిజనులు

నిరసనలో టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌

ఖమ్మంసహకారనగర్‌: ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యో గులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయడంతో పాటు పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏలు ప్రకటించా లని టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించకుండా స్కూళ్లు కలపడం, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు నిర్ణయం సరికాదన్నారు. అంతేకాక సీపీఎస్‌ రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు, పండిట్‌, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం డీఆర్వో పద్మశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనకు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పరిశ పుల్లయ్య, రాయల రవికుమార్‌, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రంజన్‌ సంఘీభావం తెలపగా టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పద్మ, రాష్ట్ర, జిల్లా నాయ కులు ఆర్‌.రమాదేవి, ముత్తయ్య, శ్యాంసుందర్‌, కె.వెంకటేశ్వరరావు, బి.వీరబాబు, గంధసిరి మల్లయ్య, కె.సంధ్యారాణి, జి.వెంకటేశ్వరరావు, హన్మంతరావు, ఎం.నాగిరెడ్డి, ఎం.ఉమాదేవి, ఆకుల నాగేశ్వరరావు, గరికి శ్రీనివాస్‌, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

కామేపల్లి: మండలంలోని కొమ్మినేపల్లి (పండితాపురం)లో జరిగే శ్రీ కృష్ణప్రసాద్‌ పశువుల వారాంతపు సంత బహిరంగ వేలం మూడోసారి కూడా వాయిదా పడింది. సంత ఆవరణంలో మంగళవారం సర్పంచ్‌ ధరావత్‌ అనురాధ అధ్యక్షతన వేలం నిర్వహించగా భూక్యా వీరన్న, ధరావత్‌ విన్నిబాబు, గుగు లోత్‌ వినోద్‌బాబు, బోడా శ్రీను పాల్గొన్నారు. గత వారం నిలిచిపోయిన రూ.1,82,80,000 వద్ద వేలం మొదలుపెట్టగా చివరకు రూ.2.09 కోట్లతో భూక్యా వీరన్న హెచ్చు పాటదారుడిగా నిలిచాడు. అయితే, ప్రభుత్వ మద్దతు ధర రానందున వాయిదా వేస్తున్నట్లు కల్లూర్‌ డీఎల్‌పీఓ విజయలక్ష్మి ప్రకటించారు. కానీ అధికారులు మొద టి, రెండో హెచ్చు పాటదారుడి డిపాజిట్‌ తిరిగి చెల్లించ లేదు. సంత కౌలు బాధ్యతలు అప్పగించే విషయమై బుధవారం గ్రామపంచాయతీ పాలకవర్గం నుంచి నివేదికను ఉన్నతాధికారులకు పంపించి, వారి సూచనలతో నిర్ణయం వెలువరిస్తామని కార్యదర్శి శంకర్‌ తెలిపారు. కాగా, ప్రభుత్వ మద్దతుధర తగ్గించి, సంతలో వసతులు కల్పించాలని డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ మేకల మల్లిబాబుయాదవ్‌, కొండాయిగూడెం పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ధనియాకుల హన్మంతరావు కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్‌, ఎంపీఓ శాస్త్రి, ఉపసర్పంచ్‌ మేకల మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురంలో శ్రీవేంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఆరో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నిత్య పూజలతో స్వామికి పుష్పయాగం నిర్వహించారు. అలాగే, శేష వాహనంపై గిరి ప్రదక్షిణ చేయించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, సూపరింటెండెంట్‌ సోమయ్య, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లిలో పోడు వివా దంమళ్లీ రాజు కుంది. కాకర్లపల్లి బీట్‌లోని 157, 158 ఫారెస్ట్‌ కంపార్ట్‌మెంట్లలో 25ఎకరాల అటవీభూమికి పట్టాలు ఇవ్వాలని సత్తుపల్లి ఒకటో వార్డుకు చెందిన నాయకపోడు గిరిజనులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. 2022లో అప్పటి ప్రభుత్వం 75 ఎకరాలకు పట్టాలు ఇచ్చినా, మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అటవీశాఖ అధికారులు 25ఎకరాల్లో జామాయిల్‌ ప్లాంటేషన్‌ వేయాలని ట్రెంచ్‌ కొట్టిస్తున్నారు. మంగళవారం కూడా ఎఫ్‌ఆర్‌ఓ స్నేహలత ఆధ్వర్యాన పనులు చేపడుతుండగా గుడిపాడు కాలనీకి చెందిన పూచి వరలక్ష్మి, రాజిని దుర్గ ఆధ్వర్యాన నాయకపోడు మహిళలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. సీఐ టి. శ్రీహరి సిబ్బందితో చేరుకుని ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమ యి దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్‌తో మాట్లాడే వరకు సంయమనం పాటించాలని సూచించడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement