ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌కళాశాల కెరీర్ గైడెన్స్ ప్లేస్‌మెంట్ సెల్ – టీఎస్‌కేసీ సం యుక్త ఆధ్వర్యాన మంగళవారం మెగా జాబ్‌మేళా నిర్వ హించారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన జాబ్‌మేళాకు 423మంది నమోదు చేసు కోగా, ఇంటర్వ్యూల అనంతరం వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 214మంది ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. వీరికి నియామక పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, ప్లేస్ మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ చందా సుధాకర్, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ ఎం.మాధవి, వివిధ విభాగాల బాధ్యు లు డాక్టర్ రమాసత్యవతి, డాక్టర్ ఎం.సునంద, యాలాద్రితో పాటు వై. రమేశ్, నరేశ్, మోజెస్ పాల్గొన్నారు.


