పోలీసు పంజా | - | Sakshi
Sakshi News home page

పోలీసు పంజా

Mar 25 2026 7:02 AM | Updated on Mar 25 2026 7:02 AM

న్యూస్‌రీల్‌

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ..

బాధితుల నుంచి రూ.3కోట్లు వసూలు చేసిన నిందితులు ఇప్పటి వరకు 24 కేసులు, 60 మంది నిందితుల గుర్తింపు నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు చట్టపరమైన చర్యలు

అక్రమార్కులపై
ఏసీబీకి చిక్కిన ఎంవీఐ

బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం అర్బన్‌ మండలం వెలుగుమట్లలోని భూదాన్‌ భూములను అడ్డుగా పెట్టుకుని సాగిన కోట్లాది రూపాయల భూదందా వ్యవహారాన్ని నిగ్గు తేల్చేలా పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిరుపేదల ఆశలను పెట్టుబడిగా మార్చుకుని అక్రమాలకు పాల్పడిన పలువురిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. ఇదే సమయాన బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్ము రాబట్టడమే లక్ష్యంగా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సిద్ధమవుతున్నారు. ఇక ఇళ్లు కోల్పోయిన వారిలో 311మందికి ప్రభుత్వం భూదాన్‌ భూముల్లోనే ఇప్పటికే ఇళ్ల స్థలాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, మరో 101మందికి వారి స్వగ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ప్రస్తుతం భూదాన్‌ భూముల్లో మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్న అధికారులు, ఇంకా అర్హుల ఉంటే గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగిస్తున్నారు.

31.7 ఎకరాలు స్వాధీనం..

భూదాన్‌ భూముల్లో స్థలాలు ఇప్పిస్తామని చెప్పిన అక్రమార్కుల మాటలను అమాయకులు నమ్మడంతో యథేచ్ఛగా విక్రయించారు. స్థలం వస్తుందనే ఆశతో బాధితులు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము నిందితులకు అప్పగించారు. ఆపై రేకుల షెడ్లు, గుడిసెలు, కొందరు స్లాబ్‌ వేసుకోగా నిర్మాణాలకు అనుమతులు లేవని తేలడంతో కోర్టు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం గత 24న కూల్చివేసింది. దీంతో అక్రమార్కులను నమ్మి నిర్మాణాలు చేపట్టిన నిరుపేదలు రోడ్డున పడ్డారు. ఈమేరకు దాదాపు రూ.250 కోట్ల విలువైన 147, 148, 149 సర్వే నంబర్లలోని 31.7 ఎకరాల భూదాన్‌ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఆస్తుల గుర్తింపు, రికవరీ

నిందితులు ముఠాగా ఏర్పడి ఒక్కో ప్లాట్‌ను ముగ్గురు, నలుగురికి విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాక పేదల నుంచి వసూలు చేసిన సొమ్ముతో నలుగురు నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను పోలీసులు గుర్తించారు. చట్టపరంగా ఈ ఆస్తులను విక్రయించి లేదా జప్తు చేసి రికవరీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ముగ్గురు సీఐలతో కూడిన బృందం సొమ్ము రికవరీపై దృష్టి సారించగా.. మరికొందరు నిందితుల బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేసేలా అధికారులకు సిఫారసు చేశారు.

పలువురిపై పీడీ యాక్ట్‌?

భూదాన్‌ భూముల్లో అక్రమాలకు పాల్పడిన నిందితుల్లో ప్రధాన వ్యక్త్తులపై కఠినంగా వ్యవహరించేందుకు పోలీస్‌శాఖ చర్యలు చేపట్టింది. నిందితులు పథకం ప్రకారం అమాయకులను మోసం చేసినందున పకడ్బందీ కేసులు నమోదు చేయడంతోపాటు పీడీ యాక్ట్‌ కూడా పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తద్వారా నిందితులకు శిక్ష పడడంతో పాటు భవిష్యత్‌లో మోసాలకు పాల్పడకుండా ఉండేలా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

బాధితులకు అండగా..

అక్రమార్కుల మాటలు నమ్మి భూదాన్‌ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రభుత్వం అక్కడే ఇళ్ల స్థలాల కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. మొదటి విడతలో సర్వేలో 415మంది అర్హులను గుర్తించి, అందులో 311 మందికి భూదాన్‌ భూముల్లోనే స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. మరో 101 మందికి జిల్లాలోని వారి స్వస్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ పత్రాలు అందజేశారు. అయితే, బాధితులు మరికొందరు ఉండడంతో సర్వే కొనసాగిస్తున్నారు. మరోపక్క భూదాన్‌ భూమిని చదును చేయడం, మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయి.

భూదాన్‌ భూమిలో వేసిన భగీరథ పైపులైన్‌

భూముల ఆక్రమణ, పేదలను మోసగించిన వారిపై ఫిర్యాదులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాధితుల నుంచి నిందితులు రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదులతో జిల్లాలోని ఆరు పోలీస్‌ స్టేషన్లలో ఇప్పటివరకు 24 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 60 మంది నిందితులు ఉండగా, 16మంది అరెస్ట్‌ అయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితులైన పోలెబోయిన ముత్తయ్య, బల్లి శ్రీనివాస్‌, కొప్పెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలంను మెజిస్ట్రేట్‌ అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు.

‘భూదాన్‌’ వ్యవహారంపై వేగంగా విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement