నేలకొండపల్లి: గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో జాతీ య స్థాయికి ఎదగాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. నేలకొండపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలస్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభను వెలికితీసేలా ఇలాంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు. నేలకొండపల్లి లో మినీ స్టేడియం ఏర్పాటు అంశా న్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. నిర్వాహకులు కోడిరెక్క వినోద్‌తో పాటు మార్కెట్ చైర్మన్ వెన్న పూసల సీతారాములు, కాంగ్రెస్ నాయకులు కోడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, వెంకన్న, పసుపులేటి ఉపేందర్, బొందయ్య, మైశా శంకర్, రాయపూడి రోహిత్, జెర్రిపోతుల సత్యనారాయణ, దోస పాటి శేఖర్, ధీరావత్ రాధాకృష్ణమూర్తి, కడియాల నరేశ్, నల్లాని మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు.


