ఖమ్మంక్రైం: మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి జీవితమే కాక కుటుంబ వ్యవస్థ, సామాజిక భద్రత చిన్నాభిన్నమవుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పోలీస్, ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యాన ఖమ్మం సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజం నుంచి మాదకద్రవ్యాలను తరిమికొట్టేలా అందరూ కలిసి రావాలని సూచించారు. విక్రయాలు, వినియోగం సమాచారం తెలిస్తే పోలీసులకు కానీ 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. పోలీసు కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ‘ఈగల్’ ఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను ఉపాధ్యాయులు గమనిస్తూ వారిని సన్మార్గంలో నడిపించాలని సూచించారు. కాగా, ఖమ్మం గాంధీచౌక్ వద్ద గోల్డెన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సదస్సులో డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ మాట్లాడారు. మేయర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర ఏసీపీ రమణమూర్తి, డీడబ్ల్యూఓ విజేత, జిల్లా ఎకై ్స జ్ శాఖాధికారి నాగేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు ప్రవీణ్‌కుమార్, కరుణాకర్, బాలకృష్ణ, మోహన్‌బాబు, భానుప్రకాష్, కృష్ణ, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
టీబీ రహిత జిల్లానే లక్ష్యం
ఖమ్మంఅర్బన్: జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం బాలాజీ నగర్‌లోని యూపీహెచ్‌సీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల పాటు జిల్లాలోని 94 గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా బాధితులను గుర్తిస్తామన్నారు. టీబీ ఉన్నట్లు తేలినవారికి చికిత్స అందిచడం ద్వారా నిర్మూలనే లక్ష్యమని తెలిపారు. అనంతరం మేయర్ పి.నీరజ మాట్లాడగా బాధితులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. డీఎంహెచ్‌ఓ రామారావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుమాధవ్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుబ్బారావు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపడాలి
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ సమావేశంలో అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు 36 శాతం మంది పిల్లలు మాత్రమే 21 రోజుల కంటే ఎక్కువగా వస్తుండడానికి కారణాలు ఆరా తీయాలని తెలిపారు. సీడీపీఓలు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రజల్లో విశ్వాసం కల్పించి పిల్లలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఖమ్మం అర్భన్, మధిర మండలంలో పరిస్థితి మెరుగుపడకపోతే బాధ్యులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. డీడబ్ల్యూఓ వేల్పుల విజేత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రదీప్‌బాబు, ిసీడీపీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


