నాణ్యతా లోపంపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

నాణ్యతా లోపంపై ఆగ్రహం

Mar 25 2026 7:02 AM | Updated on Mar 25 2026 7:02 AM

పెనుబల్లి/కల్లూరు: పెనుబల్లి మండలంలో అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన ఆమె కాలేజీ భవన మరమ్మతు పనుల్లో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నాణ్యతాలోపంతో జరుగుతుండగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈమేరకు కాంట్రాక్టర్‌తో పాటు పీఆర్‌ జేఈ, కళాశాల ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆతర్వాత ప్రభుత్వాస్పత్రిలో పరిశీలించి డాక్టర్‌ కిరణ్‌కుమార్‌కు సూచనలు చేశారు. అలాగే, కల్లూరు మున్సిపల్‌ కార్యాలయం, నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ భవనాన్ని అదనపు కలెక్టర్‌ శ్రీజ పరిశీలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సురేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ డి.మోహన్‌ నాయక్‌, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ కె.నరసింహారావు, మేనేజర్‌ ఎన్‌.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పలువురికి

షోకాజ్‌ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement