ఖమ్మం లీగల్: ఉమ్మడి జిల్లాలోని న్యాయవాదులకు ఖమ్మంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం కొనసాగుతోంది. రిసోర్స్ పర్సన్లుగా చైన్నె నుండి వచ్చిన అరుణాచలం, విజయకమల, శశిదేవి, రత్నతార వ్యవహరిస్తున్నారు. మీడియేషన్ సులభతరమైన పరిష్కార ప్రక్రియ అని, కాలయాపన లేని సత్వర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కక్షిదారుల సమస్యలు తెలుసుకుని కేసులను ఎలా పరిష్కరించాలో రోల్ ప్లే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కల్పన తరగతులను పరిశీలించారు.


