ఖమ్మంమయూరిసెంటర్: అన్ని గ్రామాల్లో ఈనెల 15లోగా మార్క్‌ఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు చింతకాని మండలంతో పాటు ముదిగొండ, కొణిజర్ల, బోనకల్, రఘునాథపాలెం మండలాల రైతులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం ప్రకటించిన రూ.2,400 మద్దతు ధరతో లాభం లేనందున రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలని కోరారు. అలాగే, అకాల వర్షాలతో పంట నష్టపోకముందే మార్క్‌ఫెడ్ కేంద్రాలు ఏర్పాటుచేసి 20శాతం తేమ పరిమితి విధించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వినతిపత్రం అందజేశారు. ధర్నాకు అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు, సర్పంచ్‌లు పర్స రామయ్య, వీరబాబు, కొమ్ము ప్రభుదానం తదితరులు సంఘీభావం తెలపగా మొక్కజొన్న రైతు సంఘం బాధ్యులు కూచిపూడి విజయ్‌కుమార్, నారపోగు నాగయ్య, పోలూరు మోహన్‌రావు, సాయి, తిరుపతి, ప్రసాద్, సామినేని వెంకటేశ్వర్లు, పోలూరి ప్రభాకర్, కొమ్మిన్ని రమేష్, కుందేలా శ్రీనాథ్, సామినేని అనంతరాములు, బత్తుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.


