‘అరసం’ అధ్యక్షుడిగా రామయ్య | - | Sakshi
Sakshi News home page

‘అరసం’ అధ్యక్షుడిగా రామయ్య

Mar 10 2026 12:48 PM | Updated on Mar 10 2026 12:48 PM

ఖమ్మం మామిళ్లగూడెం: అభ్యుదయ రచయితల సంఘం(అరసం) మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల సంయుక్త కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా కొంపల్లి రామయ్య, ప్రధాన కార్యదర్శిగా అంగోతు జయవాసు ఎన్నికయ్యారు. అలాగే, గౌరవ అధ్యక్షుడిగా తోటపల్లిసృజన్‌ కుమార్‌, ఉపాధ్యక్షులుగా సూరం ఉపేందర్‌రెడ్డి, వెంకటలక్ష్మి, రాజేందర్‌, సాధన, సుశీల, శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శులుగా యాకస్వామి, మోదుగు గోవింద్‌, కోశాధికారిగా కొత్తపల్లి కృష్ణారావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అరసం రాష్ట్ర అధ్యక్షుడు పల్లెరు వీరస్వామి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కేవీఎల్‌ సమాజంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ ప్రజాచైతన్యం తీసుకొచ్చేలా రచనలు రావాల్సిన అవసరం ఉందన్నారు. వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాధనాల వెంకటస్వామి, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు దండి సురేష్‌, జమ్ముల జితేందర్‌రెడ్డి, శింగు నర్సింహారావు, సీతామహలక్ష్మి, గాజుల భారతి, విక్టోరియా, కాళంగి వసంత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement