ఎస్సారెస్పీకి రైట్‌ రైట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీకి రైట్‌ రైట్‌

Mar 10 2026 7:20 AM | Updated on Mar 10 2026 7:20 AM

285.21 కి.మీ. మేర పూర్తి

పూర్తయితే జిల్లాలో 58,958 ఎకరాల ఆయకట్టుకు నీరు మరమ్మతులు, కాల్వలకు భూసేకరణపై దృష్టి

ఎస్సారెస్పీలో స్టేజ్‌–2 పరిధిలో కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం పూర్తికాలేదు. 54వ

ప్యాకేజీలో మొత్తం 293.671 కి.మీ. మేర కాల్వ లకు గాను 285.21 కి.మీ.

పూర్తయ్యాయి. మొత్తం 1,943 ఎకరాల

భూసేకరణకు గాను 1,935.03 ఎకరాలు సేకరించారు. ఇంకా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలో 7.37

ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇందులో సీలింగ్‌, ఇనాం, దేవాలయ శాఖ

భూములు ఉన్నాయి. భూసేకరణ కోసం ఇప్పటికే రూ.2.64 కోట్లు విడుదల చేసిన నేపథ్యాన ప్రత్యేక దృష్టి సారించారు.

స్టేజీ –2 లో పెండింగ్‌

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలాలు ఎస్సారెస్పీ స్టేజ్‌–2 ద్వారా జిల్లాలో నిర్దేశిత ఆయకట్టుకు అందాలి. నిజామాబాద్‌ నుంచి ఖమ్మం వరకు కాకతీయ కాల్వల ద్వారా వచ్చే నీటిని ప్యాకేజీ–54లోని స్టేజ్‌–2 ద్వారా పాలేరు నియోజకవర్గంతో పాటు ముదిగొండ మండలంలో 58,958 ఎకరాల స్థిరీకరణకు నిర్ణయించారు. పాలేరు రిజర్వాయర్‌తోపాటు అనుసంధానంగా ఉన్న చెరువుల ద్వారా మండలాలకు ఎస్సారెస్పీ నీరు చేరాలి. అయితే ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తయి నీళ్లు వస్తున్నా.. చివరివరకు వెళ్లడం లేదు. పలుచోట్ల భూసేకరణ జాప్యంతో కాల్వల నిర్మాణానికి అడ్డంకిగా మారింది.

ఏఐబీపీ ద్వారా పనులు

నిధుల కొరతతో ఆగిపోయిన, ఆలస్యమవుతున్న ప్రధాన, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ)ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై)లో భాగంగా ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం, కేంద్ర ప్రభుత్వం 25 శాతం నిధులు కేటాయించే ఈ పథకం ద్వారా ఎస్సారెస్పీ పనులు చేపట్టనుండడంతో పురోగతిని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పర్యవేక్షిస్తుంది.

భూసేకరణకు కసరత్తు

ఎస్సారెస్పీ ద్వారా పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు, ముదిగొండ మండలంలోని ఆయకట్టుకు సాగునీరు అందాలి. సుదీర్ఘకాలంగా కొన్ని పనులు నత్తనడకన సాగుతుండడంతో అంతటికీ నీరు అందడం లేదు. ఈ నేపథ్యాన ఏఐబీపీ పథకం నిధులతో ఇప్పటికే తవ్విన కాల్వల మరమ్మతులు, మిగిలిన కాల్వల తవ్వకానికి భూసేకరణకు కసరత్తు ప్రారంభమైంది. ఈమేరకు గత నెల 27న సీడబ్ల్యూసీ అధికారి రూపేష్‌ జిల్లాకు రాగా, జిల్లా నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ఖమ్మంరూరల్‌, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించి కాల్వలను పరిశీలించారు. ఏఐబీపీ కింద చేపట్టే పనులను జూన్‌ వరకు పూర్తిచేయాలని సూచించారు. ఇక భూసేకరణకు సంబంధించి గుర్తింపు, సర్వే పూర్తికావడంతో భూసేకరణపై ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. నోటిఫికేషన్‌ విడుదల చేసిన అనంతరం రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. భూకేటాయింపు పూర్తయిన తర్వాత పనులు చకచకా సాగనున్నాయి.

జిల్లాలో ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు) రెండో దశలో అసంపూర్తిగా ఉన్న కాల్వల పనులకు మోక్షం లభించనుంది. ఈ పనులను సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) ద్వారా

చేపట్టేందుకు సిద్ధం కాగా.. కాల్వల మరమ్మతులు, పెండింగ్‌ కాల్వల తవ్వకానికి భూసేకరణ కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలోని 58,958 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. ఇందులో చాలావరకు పనులు పూర్తయినా, కొన్నిచోట్ల

ఏళ్లుగా పెండింగ్‌ ఉన్నాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

రెండో దశలో మిగిలిన పనులకు త్వరలోనే మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement