ఖమ్మంవైద్యవిభాగం: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సేవలందిస్తూ బలోపేతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా సోమవారం ఆయన ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆర్యోగ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, చెత్త పేరుకుపోకుండా ప్రతిరోజూ శుభ్రం చేయించాలని తెలిపారు. ఆతర్వాత రోజువారీ ఓపీ సేవలు, మందుల నిల్వలను పరిశీలంచి వైద్యసేవలు, పరీక్షల నిర్వహణపై సూచనలు చేశారు. పీహెచ్‌సీ పరిధిలో నమోదైన గర్భిణులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. యూపీహెచ్‌సీల్లో సరైన వైద్యం అందితే జిల్లా జనరల్ ఆస్పత్రికి తాకిడి తగ్గుతుందన్నారు. డీఎంహెచ్‌ఓ రామారావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుమాధవ్, వైద్యాధికారులు సమీరా, సురేష్, ఉద్యోగులు ఉన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


