ఆర్చరీ ఖేలోఇండియా ఫేస్–1కు అర్హత
ఖమ్మంస్పోర్ట్స్: జాతీయస్థాయి గిరిజన ఖేలో ఇండియా ఆర్చరీ పోటీల్లో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఫేస్–1కు అర్హత సాధించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ గిరిజన ఆర్చరీ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న కె.అశ్విత్‌దొర, ఈ.ఆనంద్, కె.లక్ష్మణ్ రికర్వు ఈవెంట్‌లో జాతీయస్థాయిలో నాలుగోస్థానంలో నిలిచి ఫేస్–2 నుంచి ఫేస్–1కు అర్హత సాధించారు. వీరు త్వరలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగే ఫేస్–1 జాతీయస్థాయి గిరిజన ఆర్చరీ పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపిక కావడంపై జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు సాధుల సారంగపాణి, కార్యదర్శి పుట్టా శంకరయ్య, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
‘టీజీఈ హైట్స్’లో
భాగస్వాములు కావాలి
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలోని పోలేపల్లిలో గల టీజీఈ హైట్స్‌లో ఉద్యోగులు భాగస్వాములు కావాలని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం టీజీఈలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాట్లలో పనులు వేగంగా పూర్తవుతున్నాయని, మార్చి 15 వరకు నాలుగు టవర్లలోని సెల్లార్‌లో పార్కింగ్ పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. ఇంటర్నల్ రోడ్ల నడుస్తున్నాయని, ఇప్పటివరకు ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి బ్యాంక్‌లోన్ కోసం అవసరమైన ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మార్చి15న జరిగే ఉద్యోగ సమ్మేళనాన్ని హౌస్ బిల్డింగ్ సొసైటీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కె.వెంకటేశ్వరరావు, ఎం.వేలాద్రి, జి.శ్రీనివాసరావు, ఉషశ్రీ, కె.సత్యనారాయణ, ఆంజనేయులు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ తరగతుల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు
ఖమ్మంమయూరిసెంటర్: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంఘటన్ శ్రీజస్ అభియాన్ రెండు తెలుగు రాష్ట్రాల జిల్లా అధ్యక్షులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి నూతి సత్యనారాయణగౌడ్ నూలు వడి (చర్క) కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి కూడా పాల్గొన్నారు.
‘జూపల్లి’ వైద్యశాల ప్రారంభం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గుండె వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని హైదరాబాద్ కిమ్స్ గ్రూప్ ఆఫ్ వైద్యశాలల చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని జూపల్లి వీధిలో జూపల్లి రామచంద్రరావు ఐ అండ్ కార్డియాక్ (గుండె) ఆస్పత్రిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. దేశ విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించిన డాక్టర్ బి.స్నిగ్ధ, జూపల్లి వెంగళరావు.. తండ్రి కోరిక మేరకు సత్తుపల్లి ప్రాంతంలో జపాన్ టెక్నాలజీతో క్యాత్‌ల్యాబ్ మిషన్‌తో స్టంట్స్, పేస్‌మేకర్, యాంజియోగ్రామ్ వంటి వైద్యసేవలు తొలిసారిగా ప్రవేశపెట్టారని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ వీఆర్ వివేకానందన్, వైద్యులు అంకెం శ్రీనివాస్, దివాకర్‌రెడ్డి, విజయ, బొడ్డు రామ్మోహన్‌ప్రసాద్, ఇమ్మడి ప్రసాద్, ఎన్.కిరణ్ స్రవంతి, గార్లపాటి అశోక్, సురేశ్ రామాల, కిషోర్, పటేల్, వెంకట్రావ్, రమా కాంత్, సత్యప్రసాద్, మౌలాలీ, రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఆర్చరీ ఖేలోఇండియా ఫేస్–1కు అర్హత
ఆర్చరీ ఖేలోఇండియా ఫేస్–1కు అర్హత
ఆర్చరీ ఖేలోఇండియా ఫేస్–1కు అర్హత


