జనవరి నాటికి ఆర్వోబీ పూర్తి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి కొత్త సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని తెలిపారు. ఖమ్మంలోని ధంసలాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఆర్వోబీ, ఎంట్రీ – ఎగ్జిట్ పాయింట్ల పనులను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై ఆరాతీస్తూ ఉద్యోగులకు సూచనలు చేశారు. ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, మున్నేటిపై వంతెన నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తయిందని తెలిపారు. కాగా, పనుల సమయాన వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని చెప్పారు. నేషనల్ హైవేస్ పీడీ దివ్య, ఖమ్మం ఆర్‌డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల విస్తరణకు చర్యలు
రఘునాథపాలెం: జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రఘునాథపాలెం మండలం జింకలతండా, పువ్వాడనగర్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ)కు కేటాయించిన భూములను కలెక్టర్ పరిశీలించారు. భూవిస్తీర్ణం, సరిహద్దులు, రహదారి అనుసంధానం, మౌలిక వసతుల లభ్యతపై అధికారులతో చర్చించిన కలెక్టర్ మాట్లాడుతూ.. టీజీఐఐసీ ద్వారా కేటాయించిన భూములను సమర్థవంతంగా వినియోగించేలా పర్యవేక్షించాలని సూచించారు. మైనింగ్ ఏడీ సాయినాథ్, పరిశ్రమల శాఖ జీఎం సీతారాంనాయక్, ఆర్‌డీఓ జి.నరసింహారావు, తహసీల్దార్ శ్వేత, ఆర్‌ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.
భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి
ఖమ్మంసహకారనగర్: జాతీయ రహదారుల నిర్మా ణ పనులు వేగంగా పూర్తయ్యేలా అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ, హై వేల నిర్మాణ పురోగతిపై క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఖమ్మం – దేవరపల్లి, ఖమ్మం – కురవి సెక్షన్, నాగపూర్ – అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా భూసేకరణే కీలకమ ని తెలిపారు. ఆర్‌డీఓ నర్సింహారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీశ్రీనివాసులు, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ రామాంజనేయరెడ్డి, ఈఈయుగంధర్ పాల్గొన్నారు.
హైవే పనుల తనిఖీలో కలెక్టర్ అనుదీప్


