154 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
●ఓ వ్యాపారి, ఇద్దరు డ్రైవర్లపై కేసు
రఘునాథపాలెం: ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని రఘునాథపాలెం పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం అర్బన్ సివి ల్ సప్లయీస్ డీటీ మెచ్చు వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. రఘునాథపాలం మండలం రేగులచలకకు చెంది న బియ్యం వ్యాపారి సీహెచ్ నాగేశ్వరరావు రేషన్ బియ్యాన్ని బొలేరో వాహనాల్లో తీసుకొచ్చి సోమవారం అర్ధరాత్రి మరో లారీలోకి లోడ్ చేస్తుండగా రఘునాథపాలెం పోలీసులు తనిఖీ చేశారు. 352 ప్లాస్టిక్ సంచుల్లోని 153.50 క్వింటాళ్ల బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు అప్పగించినట్లు డీటీ తెలిపారు. ఈ ఘటనలో వ్యాపారి నాగేశ్వరరావుతో పాటు వాహనాల డ్రైవర్లు వెంకటేశ్వర్లు, పవన్‌కుమార్‌పై కేసునమోదు చేయడమే కాక మూడు బొలేరో వాహనాలు, ఒక లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరతో కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారి నాగేశ్వరరావు ఒప్పుకున్నాడని డీటీ వెల్లడించారు.
ఇసుక లారీ సీజ్
అశ్వారావుపేటరూరల్: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని మంగళవారం పోలీసులు సీజ్ చేశారు. ఏపీలోని కొవ్వూరు నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి ఇసుక తరలిస్తున్న లారీని అశ్వారావుపేటలో తనిఖీ చేయగా అనుమతి లేదని తేలింది. దీంతో లారీసీజ్ చేయడంతో పాటు సత్తుపల్లిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన డ్రైవర్ మాదు గౌతమ్, యజమాని ఎస్‌డీ ఫిర్‌దోష్‌పై కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ యయాతి రాజు వెల్లడించారు.
ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు మృతి
ఖమ్మంరూరల్: ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కింద పడిన యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. హనుమకొండలోని ద్వారకాసాయి కాలనీకి చెందిన బండి పూర్ణచందర్(రిజర్వ్ ఇన్‌స్పెక్టర్) కుమారుడైన హర్షిత్‌చంద్ర తన స్నేహితుడైన పూదారి మణికంఠతో కలిసి హైదరాబాద్ నుంచి అరకుకు ద్విచక్రవాహనంపై మంగళవారం వెళ్తున్నాడు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్‌లోని మూలమలుపు వద్ద గేదె అడ్డు రావడంతో తప్పించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన హర్షిత్‌చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల కూర్చున్న మణికంఠకు గాయాలయ్యాయి. ఘటనపై హర్షిత్ తండ్రి పూర్ణచందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
దిమ్మె పడి వృద్ధురాలు ..
సత్తుపల్లిటౌన్: మనవరాలి వద్దకు వచ్చిన ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చనుబండ గ్రామానికి చెందిన షేక్ షకీనాబీ ఆదివారం తన మనమరాలిని చూసేందుకు సత్తుపల్లిలోని వెంగళరావునగర్ వచ్చింది. సోమవారం రాత్రి మనమరాలి ఇంటి సమీపాన ఒక కార్ రివర్స్ చేస్తుండగా ఇంటి గేట్ దిమ్మెను ఢీకొట్టింది. ఆ దిమ్మె వెనకాల షేక్ షకీనాబీ కూర్చొని ఉండగా ఆమైపె కూలిన భాగం పడడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


