నేత్రపర్వంగా గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: భక్తజన సందోహం నడుమ ఖమ్మం స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాల గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. స్వామి వారి జన్మనక్షత్రం (స్వాతి నక్షత్రం) సందర్భంగా మంగళవారం సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి పల్లకీపైకి చేర్చారు. అనంతరం గుట్ట చుట్టూ నగర పుర వీధుల్లో గిరి ప్రదక్షిణ చేయగా పెద్దసంఖ్యలో భక్తులు స్వామి వారి కీర్తనలు పాడుతూ ముందుకు సాగారు. అనంతరం గుట్టపై నక్షత్ర జ్యోతిని అర్చకులు వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, దీపక్‌చౌదరి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా గిరి ప్రదక్షిణ


