‘గూగుల్’ పోటీల్లో సత్తా చాటిన తెల్లపాలెం యువకుడు
ఎర్రుపాలెం: మండలంలోని తెల్లపాలెం గ్రామానికి చెందిన వేమిరెడ్డి కార్తీక్‌రెడ్డి గూగుల్ సంస్థ నిర్వహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పోటీల్లో పాల్గొని ద్వితీయ బహుమతిగా రూ.6.50 లక్షల నగదు గెలుచుకున్నాడు. కార్తీక్‌రెడ్డి ఇంటర్ వరకు ఖమ్మంలో చదివాక భువనేశ్వర్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేసి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రూ.18 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఏడాదిపాటు ఉద్యోగం చేశా క అమెరికా వెళ్లి ఎంస్ పూర్తిచేసిన ఆయన వరల్డ్ వైడ్ కేన్సర్ రీసెర్చ్ టీంలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. తాజాగా గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఏఐ అంశంపై నిర్వహించిన పోటీల్లో లక్షలాది మంది పాల్గొనగా ద్వితీయస్థానంలో నిలిచిన కార్తీక్‌రెడ్డి నగదు బహుమతి గెలుచుకున్నాడు. కాగా, కార్తీక్ తండ్రి భాస్కర్‌రెడ్డి ఏన్కూరు మండలంలో హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
సొంతమైన రూ.6.50 లక్షల బహుమతి


