జానకీ సదనానికి రూ.12 లక్షల విరాళం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు జానకీ సదనం నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో భాగమయ్యేలా ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన శ్రీరంగం వకుళాభాష్యం రూ.12 లక్షల విరాళాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ శ్రావణ్‌కుమార్‌కు దాతలకు రశీదు అందించాక స్వామికి దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచాలి
చింతకాని/బోనకల్: విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తూ వారిలో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ సూచించారు. చింతకాని మండలం నాగులవంచ ప్రాథమిక పాఠశాల, బోనకల్‌లోని కేబీవీని సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగులవంచలో డీఈ ఓ మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్లం, తెలుగు భాషపై పట్టు సాధించేలా అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరి శీలించిన డీఈఓ.. విద్యార్థులకు గుడ్డు పెట్టకపోవడంపై ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందేలా హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పర్యవేక్షించా ల ని ఆదేశించారు. పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం ప్రధానోపాధ్యాయులు శైలజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, బోనకల్ కేజీబీవీ తనిఖీ సందర్భంగా పాఠశాల పరిసరాలు, హాస్టల్‌లో పరిశీలించిన డీఈఓ, విద్యార్థులతో మాట్లాడి వసతులు, బోధనపై ఆరాతీశారు.
ట్యాంక్ స్థలం
ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు
రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెం గ్రామంలో నీళ్ల ట్యాంకు కూల్చివేసిన స్థలం ఆక్రమణకు కొందరు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామంలో పీర్ల చావిడి, దాన్ని ఆనుకుని నీళ్ల ట్యాంకు, బావి ఉండేదని తెలిపారు. పీర్ల చావిడిని గతంలో గ్రామవాసే ఆక్రమించుకోగా, ఇప్పుడు నీళ్లట్యాంకు కూల్చివేసిన 100 చదరపు గజాల స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న స్థలానికి ప్రహరీ నిర్మాణానికి సిద్ధమయ్యారని కలెక్టరేట్‌తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, పుల్లారావు, బిక్షం, కమలమ్మ, రంగమ్మ, కృష్ణమోహన్, నాగమణి, సీతారాములు, శ్యామలమ్మ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి అదృశ్యంపైకేసు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం బల్లెపల్లికి చెందిన ఓ వ్యక్తి కానరాకుండా పోయిన ఘటనపై కేసు నమోదైంది. బల్లేపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గండు వెంకన్న(42) గత నెల 25న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆయన కుమారుడు నవీన్ ఫిర్యాదు ఖమ్మం అర్బన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
గోపాలపురంలో మహిళ..
ఖమ్మం గోపాలపురానికి చెందిన మహిళ (23) ఈనెల 13న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. భర్త నుండి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఫలితం కానరాలేదు. దీంతో ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు.
నూతన వార్డుసభ్యుడి మృతి
రఘునాథపాలెం: మండలంలోని మంగ్యాతండా గ్రామ వాసి, ఈనెల 11న వార్డుమెంబర్‌గా ఎన్నికై న కొడకళ్ల వెంకటాచారి(45) మృతి చెందాడు. గ్రామ ఒకటో వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వడ్రంగిగా జీవనం సాగించే ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమేరకు వెంకటాచారి చిత్రపటం వద్ద నూతన సర్పంచ్ మాలోతు భార్గవి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, నాయకులు రవికిరణ్, నాగేశ్వరరావు, రమేశ్, నాగాచారి, భాస్కర్ నాయకులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.
జానకీ సదనానికి రూ.12 లక్షల విరాళం
జానకీ సదనానికి రూ.12 లక్షల విరాళం


