పినపాకలో ఇరువర్గాల వాగ్వాదం
తల్లాడ: మండలంలోని పాత పినపాక గ్రామంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయు ల మధ్య సోమవారం వాగ్వాదం చోటు చేసుకుంది. పినపాకకు చెందిన బీఆర్‌ఎస్ తరఫున వార్డుసభ్యులుగా పోటీ చేస్తున్న ఎక్కిరాల నాగేశ్వరరావు, ఎక్కిరా ల అనసూర్య, తేళ్లపుట్ల లక్ష్మి, తేళ్లపుట్ల కుమారి, తేళ్లపుట్ల మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు చెందిన గుర్రం నాగేశ్వరరావు, ఆళ్ల శ్రీను, గుర్రం శివరాం, తేళ్లపుట్ల నాగేశ్వర్‌రావు, నర్వనేని శ్రీను తదితరులు ఎక్కిరాల నాగేశ్వరరావుపై దాడికి యత్నించారని ఆరోపించారు. అయితే, బీఆర్‌ఎస్ నేతలే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఎక్కిరాల ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు అందిందని ఎస్సై ఎన్.వెంకటకృష్ణ తెలిపారు.
న్యూలక్ష్మీపురంలో ఘర్షణ
ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు గ్రామ రహదారిపైకి చేరడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు చేరుకుని ఇరువర్గాల వారిని పంపించారు. అయితే, రాళ్లు, కర్రలతో తమపై దాడి చేశారంటూ ఇరువర్గాల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


