సత్తుపల్లి నుంచి శబరిమలకు సైకిల్‌యాత్ర
సత్తుపల్లిటౌన్: అయ్యప్ప మాల ధరించిన ఇద్దరు భక్తులు శబరిమలలో స్వామి దర్శనాని కి సైకిల్‌పై బయలుదేరారు. సత్తుపల్లికి చెందిన బేతిని శేషగిరిరావు, మొండ్రు క్రాంతికుమార్ సోమవారం స్థానిక మెట్టాంజనేయస్వామి ఆలయంలో ఇరుముడి ధరించి సైకిళ్లపై యాత్ర ప్రారంభించారు. ఇందులో శేషగిరిరావు గతంలో ఆరుసార్లు శబరిమల వెళ్లగా, క్రాంతి తొలిసారి వెళ్లున్నారు. వీరికి హరిహరాత్మజ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ బాధ్యులు ద్రోణంరాజు మల్లికార్జున శర్మ, క్రాంతి శ్రీనివాసరావు, బొంతు శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు.


