క్షణక్షణం అప్రమత్తంగా..
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విడత ఎన్నికలు ఆరు మండలాల్లో జరగ్గా క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాిస్టింగ్ ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. అక్కడ సీసీ కెమెరాల ద్వారా ప్రతీ అంశాన్ని కలెక్టరేట్‌లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ నుంచి పరిశీలించామని కలెక్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా మానిటరింగ్ సెల్‌లోని ఉద్యోగులు కూడా సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌ను పరిశీలిస్తూ అక్కడి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, సీపీఓ ఏ.శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మానిటరింగ్ సెల్ నుంచి పర్యవేక్షించిన
కలెక్టర్


