చెదురుముదురు ఘటనలు
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణికి చెందిన పలువురు ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఎన్నికల సందర్భంగా వీరి కోసం ట్రావెల్స్ బస్సు ఏర్పాటు చేయగా ఆదివారం నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. దీంతో బస్సు నుంచి దిగుతుండగా రెండు పార్టీల అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించేందుకు గుమికూడడంతో గందగోళం నెలకొంది. ఈ మేరకు ఎస్‌ఐ కూచిపూడి జగదీశ్ ఇరువర్గాల వారిని దూరంగా పంపించారు.
● మండలంలోని పిండిప్రోలులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఇద్దరు ఆర్మీ జవాన్లను అధికారులు అనుమతించలేదు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసి ఉంటారని చెప్పగా, తాము చేయలేదని జవాన్లు స్పష్టం చేశారు. అప్పటికే ఒక జవాన్ ఓటు వేశాడని ప్రశ్నించడం, ఇరు పార్టీల నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు చెదరగొట్టారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి వివరాలు తెప్పించుకుని పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోలేదని గుర్తించాక ఇద్దరు జవాన్లతో ఓటు వేయించారు.
● మండలంలోని పిండిప్రోలులో ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ముదిగొండ: ముదిగొండ నాలుగో వార్డులో ఏజెంట్లు ఓటర్లను మభ్య పెడుతున్నారంటూ పోలీసులను కొందరు ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది. వీరికి సర్దిచెప్పి బయటకు పంపించారు. అలాగే, పోలింగ్ కేంద్రం బయట వంద మీటర్ల పరిధిలోపు కాంగ్రెస్, సీపీఎం నేతలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐ రమేశ్ సిబ్బందితో కలిసి వారిని దూరంగా పంపించివేశారు. మల్లారంలో ఓ స్వతంత్ర అభ్యర్థిని తరఫు వ్యక్తి ఇద్దరిపై దాడి చేయగా పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఖమ్మంరూరల్: మండలంలోని తీర్థాలలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఆరెకోడులో కాంగ్రెస్, సీపీఎం వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
కూసుమంచి: మండలంలోని రాజుపేటలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అక్కడక్కడా ఘర్షణ.. నిలువరించిన పోలీసులు
చెదురుముదురు ఘటనలు
చెదురుముదురు ఘటనలు
చెదురుముదురు ఘటనలు
చెదురుముదురు ఘటనలు
చెదురుముదురు ఘటనలు


