● అంతా సజావుగానే..
జిల్లాలో రెండో విడత పోలింగ్ సజావుగానే సాగింది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు బారులుదీరారు. వృద్ధులు, ఇతర ఇబ్బందులు కలిగిన ఓటర్లను వీల్‌చైర్ల ద్వారా సహాయకులు తీసుకొచ్చి ఓటు వేయించారు. కొందరు మహిళలు చంటిబిడ్డలతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీజ, సీపీ సునీల్‌దత్, ఎన్నికల అధికారి ఖర్తడే కాళీ చరణ్ సుధామారావుతోపాటు పలువురు అధికారులు సందర్శించి, సిబ్బంది సూచనలు చేశారు. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. –సాక్షి నెట్‌వర్క్


