ప్రలోభాలకు గురిచేస్తే ఫిర్యాదు చేస్తా!
నేలకొండపల్లి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే ఎన్నికల సంఘం అధికారులకు కు ఫిర్యాదు చేస్తామంటూ ఓ ఇంటి యజమాని ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన కె.సంతోష్ తమ కుటుంబంలోని ఓట్లను అమ్ముకోబోమని... డబ్బు, మద్యం, మాంసం వంటి బహుమతులు ఇవ్వొద్దని, ఒకవేళ బలవంతంగా ఇవ్వాలని ప్రయత్నిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ వివరాలతో ఆయన ఇంటి వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా పలువురు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.
ఎన్నికల అఽధికారి బెదిరించాడని ఫిర్యాదు
మధిర: మండలంలోని పరిధిలోని వంగవీడు గ్రామపంచాయతీ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వేల్పుల జయరాజ్‌పై బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి మఽధిర రూరల్ పోలీసుకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈనెల 11న జరిగిన పోలింగ్‌లో తనకు మూడు ఓట్ల మెజార్టీ రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సిద్దిపోగు ప్రసాద్ రీకౌంటింగ్ కోరారని ఆమె వెల్లడించింది. రీకౌంటింగ్‌లోనూ తనకు మెజార్టీ వచ్చినా జయరాజ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించాడని తెలిపారు. శనివారం ఉదయం ఆయన తన ఇంటి వద్దకు వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి మళ్లీ ఓట్లు లెక్కిస్తానని చెప్పడంతో వెళ్తుండగా మార్గమధ్యలో బెదిరించాడని వాపోయింది. ఓటమిని అంగీకరిస్తూ సంతకం పెట్టాలని బెదిరించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రలోభాలకు గురిచేస్తే ఫిర్యాదు చేస్తా!


