పెద్దమ్మతల్లి ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
పాల్వంచరూరల్ : పాల్వంచ మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ ఉత్సవాలు జరుపుతున్నామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు.
ఏఐఎఫ్‌టీపీ జాతీయ
కార్యవర్గ సభ్యుడిగా సైదులు
ఖమ్మంగాంధీచౌక్: ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్(ఏఐఎఫ్‌టీపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడిగా జిల్లాకు చెందిన ఉల్లిబోయి న సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగళూరులో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. కాగా, సైదులు 2019లో జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఫౌండర్‌గా, జనరల్ సెక్రటరీగా రెండుసార్లు, వైస్ ప్రెసిడెంట్‌గా ఒకసారి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికవడంపై పలువురు అభినందించారు.
యువకుడి
ఆత్మహత్యాయత్నం
సత్తుపల్లిరూరల్: వ్యక్తిగత కారణాలతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సత్తుపల్లి మండలం కొమ్ముగూడెంకు చెందిన సోయం అజయ్ కలుపు మందు తాగగా, కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది చేరుకుని బాధితుడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అజయ్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.
అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయండి
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్‌ను బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సారపాక ఐటీసీ గెస్‌హౌస్‌లో వారు న్యాయమూర్తికి శనివారం వినతిపత్రం అందజేశారు. భద్రాచలం, మణుగూరు ప్రాంతాల నుంచి 600 పైగా సెషన్స్ ట్రయల్ కేసులు కొత్తగూడెంలో పెండింగ్ ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంతంలో నివసించే నిరుపేదలు అంతదూరం వెళ్లాలంటే ఆర్థిక భారం అవుతోందని వివరించారు. గిరిజనులకు సత్వర న్యాయం అందించాలంటే భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు అవసరమని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. లేదంటే కొత్తగూడెం నుంచి ఒక అదనపు సెషన్స్ కోర్టును భద్రాచలానికి మార్చాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటా దేవదానం, ఉపాధ్యక్షుడు సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పుసాల శ్రీనివాస్, న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్, టి.చైతన్య, మోహన్‌కృష్ణ, బి.రామకృష్ణ తదితరులు ఉన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు


