అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ బస్సులు
సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలంఅర్బన్: అయ్యప్ప మాలధారులు శబరిమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుంచి బస్సులు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. 36 సీట్లు ఉండే సూపర్ లగ్జరీ, 40 సీట్లు ఉండే డీలక్స్, 49 సీట్లు ఉండే ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు రాజధాని బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. కిలోమీటర్‌కు డీలక్స్ బస్సుకు రూ. 57, లగ్జరీ బస్సుకు రూ.59, ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.68, ఏసీ రాజధాని బస్సుకు రూ.77 చొప్పున అద్దె చెల్లించాలని అధికారులు తెలిపారు. స్వాములు వంట సామగ్రి తీసుకెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ప్రయాణించే కిలోమీటర్ల ఆధారంగా అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అన్ని బస్సులకు వెయిటింగ్ చార్జి గంటకు రూ.300గా నిర్ణయించారు. ఒక బస్సు బుక్ చేస్తే గురుస్వామితోపాటు ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు మణికంఠ స్వాములు, అటెండర్‌కు చార్జి మినహాయింపు ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేస్తే గురుస్వామికి రోజుకు రూ.300 చొప్పున కమీషన్ చెల్లించనున్నారు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లను కేటాయించనున్నారు. బస్సుల కోసం డిపోమేనేజర్లను సంప్రదించాలని, ఇతర తీర్థయాత్రలకూ బస్సులు ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు.
అద్దెకు ఇస్తున్న యాజమాన్యం
శబరిమల యాత్ర భక్తుల కోసం బస్సులను అద్దెకు ఇస్తున్నాం. కిలోమీటరు చొప్పున, వెయిటింగ్ సమయాన్ని లెక్కగట్టి తగిన ధర నిర్ణయిస్తాం. ఈ అవకాశాన్ని అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకోవాలి.
– జంగయ్య, ఆర్టీసీ డిపో మేనేజర్, భద్రాచలం
అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ బస్సులు


