రెండో విడత ఎన్నికలకు సిద్ధం
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడతగా జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆరు మండలాల్లో ని 160 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు 451 మంది, 1,379 వార్డులకు 3,352 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 2,023 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడంతో పాటు 1,831 పోలింగ్ అధికారులు, 2346 మంది ఓపీఓలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. కాగా, 28 ప్రాంతాల్లో 304 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామ ని వెల్లడించారు. ఈ విడతలో 2,51,327 మంది ఓటర్లు ఓటు హ క్కు వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు.
భూవివాదాలపై
అవగాహన అవసరం
భూవివాదాలు, చట్టాలపై పోలీసు అధికారులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న ట్రెయినీ ఐపీఎస్‌లకు భూవివాదాలు, శాంతి భద్రతల నిర్వహణపై కలెక్టర్ అనుదీప్ వీసీ ద్వారా అవగాహన కల్పించారు. ప్రభుత్వ సేవలు, భూ సమస్యల పరిష్కార విధానాలు, కోర్టు వ్యవహారాలు, పోలీసుశాఖతో సమన్వయం, భూభారతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. అనంతరం ట్రెయినీ ఐపీఎస్‌లు పాలనా పారదర్శకత, బాధ్యత, క్షేత్రస్థాయి సవాళ్లు, భూసంబంధిత అంశాలు, కోర్టు కేసులపై అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. భూవ్యవహారాలకు సంబంధించి పోలీసు అధికారులు కనీస పరిజ్ఞానం, అవగాహన పెంచుకుంటే శాంతిభద్రతల నిర్వహణలో ఉపయోగపడుతుందని తెలిపారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


