పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు
నేలకొండపల్లి: రెండో విడతగా ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు. మండలంలోని కొత్తకొత్తూరులో సామగ్రి డిస్ట్రిబ్యూసన్ కేంద్రం, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. నేలకొండపల్లి మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ఆదివారం పోలింగ్ జరగనుండగా, నాలుగు జోన్లు, ఆరు రూట్లుగా విభజించినట్లు తెలిపారు. కొత్తకొత్తూరు ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలోని పది కౌంటర్ల ద్వారా ఉద్యోగులకు సామగ్రి పంపిణీ చేసి 27 బస్సుల్లో కేంద్రాలకు తరలిస్తామని వెల్లడించారు. నేలకొండపల్లి ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ సీ.హెచ్.శివ తదితరులు పాల్గొన్నారు.


