బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
వైరా: బాల్య వివాహాలు లేని సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్(ఎయిడ్) సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్ సూచించారు. వైరాలోని మధు జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 2030 నాటికల్లా బాల్య వివాహాలను అరికట్టాలని ప్రభుత్వ శాఖల ద్వారా రెండున్నరేళ్ల నుంచి అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఇందులో అందరూ పాలుపంచుకుని బాలికలకు మెరుగైన భవిష్యత్ దక్కలా పాటుపడాలని సూచించారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వలంటీర్ మాధవీలత, మధు కళాశాల సెక్రటరీ మల్లెంపాటి వీరభద్రం, కరస్పాండెంట్ రంజిత్, ప్రిన్సిపాల్ రాంబాబు, కే.వీ.చారి తదితరులు పాల్గొన్నారు.


