సర్పంచ్‌లుగా యువత, విద్యావంతులు
రఘునాథపాలెం: మండలంలోని పలు గ్రామపంచాయతీల సర్పంచ్‌లుగా యువత, విద్యావంతులు విజయం సాధించారు. గ్రామాలను అభివృద్ధి చేసేలా తమకు అవకాశం ఇవ్వాలని కోరడంతో ప్రజలు వారికి పట్టం కట్టారు. పారదర్శక పాల న, సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని వారు ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. వీఆర్ బంజర్ సర్పంచ్‌గా ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన భూక్యా రమణ, చింతగుర్తి సర్పంచ్‌గా బీటెక్ పూర్తి చేసిన తమ్మినేని ప్రియాంక విజయం సాధించారు. ఇక జీకే బంజర నుంచి పీజీ చదివి ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకురాలిగా చేసిన మాలోత్ జ్యోతి ఎన్నికయ్యారు. అంతేకాక కొర్లబోడు తండా సర్పంచ్‌గా యువకుడు భూక్యా చిన్నయ్య విజయం సాధించారు.
సర్పంచ్‌లుగా యువత, విద్యావంతులు
సర్పంచ్‌లుగా యువత, విద్యావంతులు


