●అక్రమంగా సంపాదిస్తే ఆస్తి జప్తు చేయండి
●బాండ్ పేపర్‌తో సర్పంచ్ అభ్యర్థి ప్రచారం
రఘునాథపాలెం: గ్రామపంచాయతీ ఎన్నిక ల ఎన్నికలవేళ కొందరు అభ్యర్థులు వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రఘునాథపాలెం మండలం పువ్వాడనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా సీపీఎం మద్దతుతో బరిలోకి దిగిన కూచి పూడి నరేష్ కూడా ఇదే కోవలోకి వస్తారు. ‘సర్పంచ్‌గా ఎన్నికయ్యాక నేను రూపాయైనా అక్రమంగా సంపాదిస్తే ఆస్తిమొత్తం గ్రామపంచాయతీ అధికారులు, గ్రామప్రజలు స్వాధీనం చేసుకోవచ్చు. ప్రజల కోసం పనిచేయడమే నా ధర్మం’ అంటూ బాండ్ పేపర్ రాయించిన ఆయన ఆ ప్రతులను ఓటర్లకు అందిస్తున్నాడు. నిజాయితీపరులకే ఓటర్లు పట్టం కట్టాలని కోరుతున్నాడు.


