కాంగ్రెస్‌తోనే తెలంగాణ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే తెలంగాణ ఏర్పాటు

Dec 10 2025 7:50 AM | Updated on Dec 10 2025 7:50 AM

కాంగ్

కాంగ్రెస్‌తోనే తెలంగాణ ఏర్పాటు

ఖమ్మంమయూరిసెంటర్‌: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌తో పాటు పార్టీ అగ్రనాయకురాలు సోని యా గాంధీ కృషి మరువలేనిదని కాంగ్రెస్‌ జిల్లా, ఖమ్మం నగర అధ్యక్షులు నూతి సత్యనా రాయణ, నాగండ్ల దీపక్‌చౌదరి అన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకల్లో వారు మాట్లాడారు. సోనియా పుట్టినరోజును తెలంగాణ తల్లి అవతరణ దినో త్సవంగా ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కార్పొరేటర్‌ లకావత్‌ సైదులు, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మహ్మద్‌ జావేద్‌, వడ్డెబోయిన నరసింహరావు, యర్రం బాలగంగాధర్‌ తిలక్‌, కొత్తా సీతరాములు, పుచ్చకాయ ల వీరభద్రం, మొక్క శేఖర్‌గౌడ్‌, కన్నం ప్రసన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తక్కువ ప్రీమియంతో పోస్టల్‌ బీమా పథకాలు

ఖమ్మం మామిళ్లగూడెం: ఇతర సంస్థలతో పోలిస్తే అతితక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా పొందే పథకాలు తపాలాశాఖలో అందుబాటులో ఉన్నాయని ఖమ్మం సూపరింటెండెంట్‌ వీరభద్రస్వామి తెలిపారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ రూ. 550తో సంవత్సరానికి రూ.10లక్షలు, రూ. 750తో రూ.15 లక్షల బీమా అమల్లో ఉంటుందని వెల్లడించారు. అలాగే, సేవింగ్స్‌ ఖాతాను రూ.500తో ప్రారంభిస్తే ఏటీఎం, నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం ఉంటుందని తెలిపారు. అంతేకాక సుకన్య సమృద్ధి పథ కం ద్వారా పదేళ్ల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారు రూ.250 మొదలు రూ.లక్షన్నర వరకు జమ చేయవచ్చని వెల్లడించారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ)రాష్ట్రప్రధాన కార్యదర్శి కట్టెకోల రాంనారాయణ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావుతో పాటు కోశాధికారి కళ్యాణ్‌చక్రవర్తి, నామా పురుషోత్తం, తపాలా శాఖ ఉద్యోగి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్బన్‌ పార్క్‌లో

పటిష్ట రక్షణ ఏర్పాట్లు

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లి అర్బన్‌పార్కులో వన్యప్రాణుల రక్షణ కోసం పటిష్ట ఏర్పాట్లు చేయనున్నట్లు ఎఫ్‌డీఓ వాడపల్లి మంజుల తెలిపారు. సింగరేణి ఏజీఎం రామకృష్ణతో కలిసి మంగళవారం ఆమె పార్కు ప్రహారీ, ఫెన్సింగ్‌ను పరిశీలించారు. సుమారు మూడు కి.మీ. మేర పది అడుగుల ఎత్తుతో సింగరేణిగా ఆధ్వర్యాన ప్రహారీ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో రేంజర్‌ పి.స్నేహలత, ఎఫ్‌ఎస్‌ఓ అరుణ్‌కుమార్‌, సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నారు.

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో పరిశీలన

కారేపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కారేపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం ఏర్పాటుచేస్తుండగా జెడ్పీ సీఈఓ దీక్షరైనా మంగళవారం పరిశీలించారు. మండలంలోని 41గ్రామపంచాయతీల పరిధిలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఇక్కడే సామగ్రి పంపిణీ చేయనుండగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం కారేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రాన్ని కూడా సీఈఓ పరిశీలించారు. తహసీల్దార్‌ అనంతుల రమేష్‌, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ రవీంద్రప్రసాద్‌ ఉన్నారు.

కాంగ్రెస్‌తోనే  తెలంగాణ ఏర్పాటు
1
1/2

కాంగ్రెస్‌తోనే తెలంగాణ ఏర్పాటు

కాంగ్రెస్‌తోనే  తెలంగాణ ఏర్పాటు
2
2/2

కాంగ్రెస్‌తోనే తెలంగాణ ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement