ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
తల్లాడ/కల్లూరు రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. తల్లాడ మండలం మల్లారం, కల్లూరు మండలం లింగాలలోని నామినేషన్ల ఉపసంహణ, పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తూ పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. తల్లాడ మండల ప్రత్యేకాధికారి శివప్రసాద్, తహసీల్దార్లు కరుణాకర్‌రెడ్డి, పి.సాంబశివుడు, ఎంపీడీఓలు సురేష్‌బాబు, చంద్రశేఖర్, ఎంపీఓ పి.రాజారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, కల్లూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటుచేస్తుండగా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మంగళవారం పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు.
‘గోపా’ రాష్ట్ర
ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుడిద శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ బండి సాయన్నగౌడ్, జీ.వీ. శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర కోశాధికారి ఎం.రఘునాథ్‌గౌడ్ ఖమ్మంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేయగా, నాయకులు సాయివేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి


