వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి.రామారావు సూచించారు. ఖమ్మం పాండురంగాపురంలోని బస్తీ దవాఖానాను సోమవారం తనిఖీ చేసిన ఆయన వైద్యులు, సిబ్బంది హాజరును పరిశీలించి మాట్లాడారు. సికిల్ సెల్ పేషంట్ల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి ప్రతీనెల మందులను ఇవ్వాలని సూచించారు. అనంతరం మామిళ్లగూడెం యూపీహెచ్‌సీని కూడా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వైద్యులు ఎం.అనిరుధ్, కృష్ణచైతన్యతో పాటు ఉద్యోగులు శ్రీలత, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


