●44ఏళ్ల తర్వాత పాలేరు ఏకగ్రీవం
కూసుమంచి: మండలంలో పెద్ద గ్రామపంచాయతీల్లో ఒకటైన పాలేరు గ్రామపంచాయతీ 44 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైన బానోత్ నాగేశ్వరరావును ఏకగ్రీవ సర్పంచ్‌గా గ్రామస్తులు ఎన్నుకున్నారు. గతంలో 1981లో గోపె మోతెయ్య వార్డు సభ్యులు ఎన్నకునే పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో కమ్యూనిస్టు కంచుకోటగా ఉన్న పాలేరులో 1959లో తొలి సర్పంచ్‌గా సీపీఎం నుండి బజ్జూరి పుల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నుండే పలువురు సర్పంచ్‌లుగా గెలిచారు. 2019 ఎన్నికల్లో 75ఏళ్ల వయస్సు కలిగిన ఎడవెల్లి మంగమ్మ సీపీఎం తరఫున సర్పంచ్‌గా గెలవగా, ఆమె హయాంలో గ్రామపంచాయతీ గుడ్ గవర్నెస్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. పాలేరు అనగానే రిజర్వాయర్, నవోదయ విద్యాలయ గుర్తుకొస్తాయి. ఈ పంచాయతీలో 2,798 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఈ గ్రామంలోని 12వార్డులకు గాను తొమ్మిది ఏకగ్రీవమయ్యాయి.
●44ఏళ్ల తర్వాత పాలేరు ఏకగ్రీవం


